బిగ్ బాస్ బ్యూటీ బాత్రూం సెల్ఫీ.. వైరల్!
on May 16, 2021
చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మందనా కరిమి ఒకరు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్రూం లో బట్టలు లేకుండా దిగిన సెల్ఫీని షేర్ చేసింది.
వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2017లో వివాహబంధంతో ఒక్కటైంది. అయితే పెళ్లైన నెల రోజులకే భర్త, అత్తమామలపై గృహహింస కేసు పెట్టి షాకిచ్చింది. ఆ తరువాత కేసు వాపసు తీసుకుంది. ఇప్పుడు తన భర్తకు దూరంగానే ఉంటోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు ఏకంగా బాత్రూమ్ లో బట్టలు లేకుండా ఉన్న సమయంలో తీసిన ఓ సెల్ఫీను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో బ్లర్ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీకి నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. 'మీ జీవితాన్ని మార్చగలిగే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా..? అయితే వెంటనే అద్దంలో చూడండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
